కరువు, కష్టాలు, వలస జీవనంతో ముద్రపడిన రాయలసీమ ప్రాంతం అనేక పోరాట గాథలకు కేంద్రమైంది. అలాంటి ప్రేరణాత్మక గాథలలో ఒకటి డా|| కుమ్మరి ఆదిలక్ష్మి కథ. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈ గ్రామీణ బహుజన మహిళ ఎన్నో ప్రతికూలతలను అధిగమించి తన కలలను నెరవేర్చుకున్నారు. ఆమె జీవితం ధైర్యానికి, సంకల్పానికి చిహ్నంగా నిలిచింది, ఎందరికో స్ఫూర్తి కలిగిస్తోంది.
బాల్యం మరియు విద్య
ఆదిలక్ష్మి రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లాలోని డోన్ మండలానికి చెందిన ఆవులదొడ్డి గ్రామంలో జన్మించారు. ఆమె బాల్యం అమ్మమ్మ ఊరైన కప్పట్రాళ్ళలో గడిచింది, అక్కడ 7వ తరగతి వరకు చదువుకున్నారు. జీవనోపాధి కోసం ఆమె తల్లిదండ్రులు కర్నూలుకు వలస వెళ్లడంతో అక్కడ ఆమె తన విద్యను కొనసాగించారు. కర్నూలులోని వివిధ పాఠశాలల్లో చదివి, కె. వి. ఆర్. కాలేజీ నుండి ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పీజీ అభ్యసించి, తెలుగు పండిట్ ట్రైనింగ్ కూడా చేశారు.
పితృస్వామ్య సమాజంలో సవాళ్లు
పితృస్వామ్య ప్రభావం ఉన్న సమాజంలో డా|| ఆదిలక్ష్మి ఉన్నత విద్యను పొందాలని కలగన్నప్పుడు, ఆమె తండ్రి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. “ఇల్లు వదిలి బయటకు వెళ్లడం వల్ల ఏదైనా అనర్థం జరుగుతుందేమో” అనే భయంతో ఆమె తండ్రి ఆమె కలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆదిలక్ష్మి తన సంకల్పాన్ని ప్రదర్శించి, ఉన్నత చదువుల కోసం ఇంటి నుండి వెళ్లిపోయారు. ఈ నిర్ణయం ఆమె తండ్రితో సంబంధాన్ని దెబ్బతీయగా, ఆమె తన లక్ష్యాల నుండి పక్కకు తప్పలేదు.
పరిశోధన ప్రస్థానం
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో మొదటగా ఉద్యోగం పొందడమే ఆమె లక్ష్యంగా ఉండేది. కానీ, అవకాశాలు లభించకపోవడంతో పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నారు. “తెలుగు కథా సాహిత్యం – వివాహ వ్యవస్థలో వస్తున్న పరిణామాల పరిశీలన (1910–2010)” అనే అంశంపై ప్రొఫెసర్ గోనా నాయక్ పర్యవేక్షణలో ఆమె పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ పరిశోధన విద్యాభ్యాసం మాత్రమే కాకుండా, సమాజాన్ని మరియు తనను తాను అర్థం చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

మద్దతు మరియు వ్యక్తిగత జీవితం
విశ్వవిద్యాలయంలో ఆమె సీనియర్ అరుణ అనే ఒక మహిళ ఆమెకు సోదరి మాదిరిగా మద్దతు అందించారు, అన్ని విధాలా అండగా నిలబడ్డారు. ఈ మద్దతు ఆమె ప్రయాణంలో కీలకంగా నిలిచింది. అదే విధంగా, అదే యూనివర్సిటీలో చదువుకున్న తన మిత్రుడితో ఆదిలక్ష్మి కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడం ద్వారా సామాజిక నియమాలను ధిక్కరించారు.
సృజనాత్మక ప్రతిభ
ఉన్నత విద్యతో పాటు ఆమె సృజనాత్మకతను కూడా అభివృద్ధి చేసింది. విభిన్న కవితలు, కథలు రాస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేయడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవడమే గాకుండా తన ప్రతిభను కూడా మెరుగుపరుచుకుంది. తన ఆత్మ విశ్వాసాన్ని బలపరచుకునేందుకు బాల్యంలోనే కరాటే నేర్చుకొని, పోటీలో పాల్గొని పథకాన్ని సాధించింది.


సమాజానికి స్ఫూర్తి
డా|| కుమ్మరి ఆదిలక్ష్మి లాంటి బడుగు బలహీన వర్గాల గ్రామీణ మహిళలు ఈ పితృస్వామ్య కుల సమాజాన్ని ఎదిరించి ఉన్నత చదువులు చదువుకుని, ఒంటరి పోరాటం చేస్తూ, తాము కలలుగన్న జీవితాలను పొందకపోతే వారు సగటు రాయలసీమ గ్రామీణ బడుగు బలహీన మహిళల మాదిరే ఎప్పటికీ ఇంటికి, వంటకి, చేనులో కూలీ పనికే పరిమితయమ్మే ప్రమాదం ఉంది.
డా|| కుమ్మరి ఆదిలక్ష్మి వృత్తిపరంగా ఉపాధ్యాయురాలిగా కొనసాగాలని, మహిళా సాధికారత కొరకు కృషి చేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె సాధించిన విజయం సమాజంలో బహుజన కులాల శక్తిని చాటిచెబుతోంది.
డా|| ఆదిలక్ష్మి జీవితం వ్యక్తిగత విజయమే కాకుండా, పీడిత కులాలకు మరీ ముఖ్యంగా గ్రామీణ మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది విద్య యొక్క మార్గదర్శక శక్తిని, అలాగే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది.

Life is a journey, not a race. Every step you take, no matter how small, brings you closer to your dreams. Trust in your ability to adapt, learn, and grow. She totally believed her strength and she can’t took her step back , what happened she participating everything if she wins it’s okay,if she loose that she will learning new things overall I like her journey…
Believe in your unique path, and remember—great things never come from comfort zones.
Keep on going 💪
Such a inspirational life.. wishing good for ఆదిలక్ష్మి కుమ్మరి…
Thank you Raj Kumar Paseddula.. keep bringing the lives like this