నవోదయ – నా జీవితంలోని వెలుగులు
నవోదయలో చేరిన తొలి రోజు నా తల్లిదండ్రులు నన్ను స్కూల్ గేట్ వద్ద వదిలి వెళ్తున్నప్పుడు తెలియని బాధతో వెక్కి వెక్కి ఏడ్చాను. అదే ఐదు సంవత్సరాల తరువాత, నవోదయను విడిచిపెట్టేటప్పుడు కూడా తల్లి లాంటి నవోదయకు దూరం అవుతున్న బాధతో బరువెక్కిన గుండెతో కన్నీటి ధారలు ఆపుకోలేకపోయాను. అడవి తల్లి ఒడిలోని ఒక చిన్న గ్రామం నుండి నవోదయలో అడుగుపెట్టడమే నా జీవితంలో చెప్పుకోదగిన పెద్ద విజయంగా భావించాను.
ఈ ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటు నన్ను నేను మరింతగా తెలుసుకున్నాను. సామాజిక ప్రయోగశాల లాంటి నవోదయలో అందరిని కలుపుకుంటూ, అందరికీ తమ ప్రతిభను చాటుకునే అవకాశాలను అందిస్తూ, నాణ్యమైన విద్యతో మౌలిక వసతులు అందించడంలో నవోదయ ప్రత్యేకత చూపించింది.

నవోదయ కుటుంబ అనుబంధం
నవోదయ విద్యాలయాల్లో విద్యార్థులను కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వివిధ హౌస్‌లుగా విభజించి బంధాలను పెంచడం ఎంతో వినూత్నం. హౌస్‌ల మధ్య ఆరోగ్యకర పోటీతత్వం, సహృదయత, ఆత్మీయతను పెంపొందించడంలో నవోదయ విద్యాలయాలు గొప్ప సఫలీకృతం అయ్యాయి.
నవోదయలో గడిపిన జ్ఞాపకాలు, నా మిత్రుల అనుబంధాలు నన్ను ఇప్పటికీ స్పూర్తితో నింపుతాయి. పాఠశాల పూర్తి అయిన తరువాత కూడా మా 18వ బ్యాచ్ మిత్రులతో సన్నిహితంగా ఉన్నాను. బాల్యం నుండి ఇప్పటి వరకు నాకు ఉన్న అత్యంత ఆత్మీయ మిత్రులు నవోదయ మిత్రులే కావడం నేను గర్వంగా భావిస్తాను.

అలుమ్ని సంస్థ – ఆశాజనక కార్యక్రమాలు
నవోదయ పూర్వ విద్యార్థుల కోసం అలుమ్ని సంస్థ చేపట్టిన కార్యక్రమాలు మన నవోదయ కుటుంబం బలం పెంచడానికి తోడ్పడుతున్నాయి. సిల్వర్ జూబిలీ వేడుకలు జరిగిన దశాబ్దం తరువాత, ఈ డిసెంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే గ్రాండ్ అలుమ్ని ఈవెంట్ మరోసారి నవోదయ కుటుంబ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తోంది.

నవోదయ – భవిష్యత్తు వెలుగులు
“Enter to Learn – Leave to Serve” అనే నినాదంతో ఆవిర్భవించిన మన నవోదయ విద్యాలయ అలుమ్ని సంస్థ మరింత శక్తివంతమైన నెట్వర్క్‌గా ఎదగాలని ఆశిస్తున్నాను. నాకు జీవన మార్గాన్ని చూపించిన నవోదయకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. ఈ గ్రాండ్ ఈవెంట్ లో పాల్గొని, మా మిత్రులతో పాటు ఎంతో మంది సీనియర్లు, జూనియర్లు, అధ్యాపకులను మరియు బోధనేతర సిబ్బందిని కలవాలని, నా బాల్య జ్ఞాపకాలను మళ్ళీ తట్టి లేపడానికి నేను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

Yes it’s true dear Rajkumar, i too have come from remote atea& a very poor family, i think without Navodaya i might not in the comfort zone of today’s life, Navodaya not only gave me education but also a very big family to share our problems & a helping hand,
🙏🙏🙏
నా మనసుకి దగ్గరగే ఉండే విషయాల్లో నవోదయ school ఒకటి anna(అన్న 18th batch.. నేను 20th బ్యాచ్).
కష్టమైన ఇష్టం.
ఎన్నో విషయాలు , ఇంకెన్నో మాటలు.. మరుపురాని కథలు.. ఆ కథల మధ్య మేము..
మా ఆ సంఘర్షణను వదిలి ~11 సంవత్సరాలు అయిందంటే నమ్మసఖ్యంగా లేదు.
అందరికీ time వస్తుంది మన పూర్వపు విద్యార్థుల సమ్మేళనం రోజు.. అదే dec 14 and 15 2024.
మిత్రులు, senior,junior లు.. మరొక్కసారి అందరం చిన్నపిల్లలైపోదాం. మీ అందరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటాం .
missing you all
Super mama
Well said
Suuper mawa
Recollecting those memories
Nice 🤝
Super ga rashavu nice chala madhuramaina balyam yeppatiki thirigi rani gurthundi poyela rashavu nice 👍👍👍
“Thank you sir for sharing such a heartfelt piece about your childhood days. I could really feel the nostalgia in your words, especially when you described about our interhouse competition … It reminded me of the days in Navodaya…. (Assignments, projects, clusters regional meets , assembly in the morning, skirts,drama mime, singing competition,navodaya songs ..hami Navodaya hooo, music classes especially PET sir …and many …. I truly appreciate how vividly you brought those memories to life —looking forward to reading more from you sir !”
Super Anna
Nice ra tammudu… chakkaga rasav
Dear Raj Kumar,
Thanks for putting our feelings and memories in words. If God gives me a chance to time travel, I Would definitely choose to go back to first day in Navodaya.
Keep writing, expecting more from you.
తమ్ముడు రాజ్, హస్టల్ జీవితం చక్కగా వివరించావు.
పాఠశాల నుంచి తీసుకోవడమే కాదు
పాఠశాలకు తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి.
అదే చదువు అంటే!
రాజ్,
నీవు మన పల్లెలో విద్యార్థులకు విద్య గురించి చక్కగా చెప్పడం నేను విన్నాను.
నీలాంటి యువకులు ఇ సోసైటీ చాలా అవసరం.నవోదయ గురుకుల విద్యార్థులకు మనవ విలువల గురించి సోసైటీ లో ఎలా ఉండాలి, ప్రస్తుత సమాజం ఎలా ఉంది, మీరు ఎలా జీవించాలని అనుకుంటున్నారు?